google-site-verification: googleb373ea7e16bf462c.html

ఉత్తరాఖండ్, రూప్ కుండ్ సరస్సులో అస్తిపంజరాల గుట్ట.. అంతుబట్టని మిస్టరీ!

  1. చుట్టూ వందల కొద్దీ పురాతన అస్థిపంజరాలున్నసరస్సు అది. వారిని చంపింది ఎవరు?
  2. పుర్రెల వెనుక భాగంలో క్రికెట్ బంతి సైజు రంథ్రాలు

1942లో రూప్ కుండ్ లోని ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ ఒక భయంకరమైన విషయం కనుగొన్నాడు. అదేంటంటే, సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఒక చిన్న లోయ, అడుగున పూర్తిగా అస్థిపంజరాలతో నిండిన ఒక ఘనీభవించిన సరస్సు. ఆ వేసవిలో మంచు కరగడం వల్ల మరిన్ని అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. నీటిలో తేలుతూ సరస్సు అ౦చుల చుట్టూ వున్నాయి. ఇక్కడ ఏదో ఘోరం జరిగింది అనుకున్నాడు.

అది యుద్ధ సమయం కావడంతో భారతదేశంలోకి దొంగతనంగా వచ్చి మరణించిన జపాన్ సైనికుల అవశేషాలు అని భావించాడు. జపాన్ భూఆక్రమణకు భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఇది నిజమా కాదా అని తేల్చడానికి పరిశోధకుల బృందాన్ని పంపింది. అయితే, ఈ ఎముకలు జపాన్ సైనికులవి కావు. ఎందుకంటే ఎముకలు చాలా పురాతనమైనవని స్పష్టమవుతో౦ది. మాంసం, వెంట్రుకలు, ఎముకలు పొడి, చల్లని గాలి ద్వారా సంరక్షించబడ్డాయి, అయితే అవి ఎలా వచ్చాయి అనే విషయాన్ని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. అంతకు మించి, ఈ చిన్న లోయలో 200 మంది కి పైగా ప్రజలను ఎవరు చంపారు? కొండచరియలు విరిగా, ఆత్మహత్యలా అనే అనుమానాలు వచ్చాయి. దశాబ్దాల పాటు స్కెలెటన్ సరస్సు యొక్క మిస్టరీని ఎవరూ వెలుగులోకి తేలేకపోయారు.

Roopkund_Lake00

కారణమేమిటి.....

అయితే, 2004లో జరిగిన ఒక సాహస యాత్ర ఆ ప్రజల మరణానికి కారణమేమిటనే మిస్టరీని ఎట్టకేలకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎవరూ వూహించని సమాధానం వింతగా ఉంది. చెప్పాలంటే, అన్ని శరీరాలు సుమారు 850 AD నాటివి. DNA సాక్ష్యం బట్టి ఇవి రెండు వేర్వేరు సమూహాలు. ఒకటి సన్నిహిత సంబంధం కలిగిన తెగ, మరియు రెండవది చిన్న స్థానికుల సమూహం. అయితే ఇక్కడ దొరికిన రింగులు, ఈటెలు, తోలు బూట్లు, వెదురు కర్రలు వంటి అధారాలను బట్టి ఈ బృందం స్థానికుల సహాయంతో లోయ గుండా వెళ్లే యాత్రికుల సామాన్లని మోసే కూలీలు లేదా గైడులు అని భావిస్తున్నారు.

హిమాలయ స్త్రీలలో ఒక ప్రాచీన మరియు సంప్రదాయ జానపద పాట ఉంది. ఆ గేయాలలో ఒక దేవత తన పర్వతాలను అపవిత్ర౦ చేసిన వారిని ఎలా శిక్షించిందో వర్ణి౦చి౦ది. ఆ దేవత ఇనుముతో కలిసిన వడగండ్లు విసిరి వారిని చంపింది. ఒక్కసారిగా వడగళ్ల వానకు దాదాపు 200 మంది మరణించారు.

Roopkund,Trishul,Himalayas

స్థానికుల కథనం...

అయితే స్థానికుల కథనం ప్రకారం, కశ్మీర్ జనరల్ జోరావర్ సింగ్ అతడి సైన్యం 1841లో టిబెట్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని మరణించారని చెబుతున్నారు. అయితే, మరికొందరు వేరే కారణాలు కూడా తెలుపుతున్నారు. కనౌజ్ జస్దావాల్ రాజు, అతడికి కాబోయే భార్య బలంపా వారి సేవకులు నృత్య బృందాలతో కలిసి నందాదేవీ ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా మంచు తుఫాన్ ఏర్పడింది. దీంతో వారంతా మంచులో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు.
తలకి  దెబ్బ తగలడంతో వారంతా ఒకే విధంగా మరణించారు. అయితే, పుర్రెల్లో చిన్న లోతైన పగుళ్లు, ఆయుధాల వల్ల కాకుండా, గుండ్రంగా ఉండే దాని ఫలితంగా ఐనట్టు కనిపించింది. శరీరాలపై  కాకుండా తలపై గాయాలు మాత్రమే ఉన్నాయి, భుజాలపై దెబ్బలు తిన్నగా పైకి వచ్చాయి.

Roopkund_Lake6

పుర్రెలు పగిలాయి..

ఈ మిస్టరీపై 2014లో శాస్త్రవేత్తలు 200 పైగా అస్తిపంజరాలపై పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. ఇవి 9వ శతాబ్దంలో అక్కడ నివసించిన గిరిజనులవని తెలిసింది. పుర్రెల వెనుక భాగంలో క్రికెట్ బంతి సైజు రంథ్రాలు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, అవి యుద్ధం లేదా ఆయుధాల వల్ల ఏర్పడినవి కావని, వడగళ్ల వాన వల్ల కావచ్చని అభిప్రాయపడ్డారు. లోయలో చిక్కుకుపోయి ఎక్కడా దాక్కోడానికి లేదా ఆశ్రయం లేని వారిపై క్రికెట్ బంతి సైజు [ సుమారు 9 అంగుళాల చుట్టుకొలత] వడగండ్లు వేలసంఖ్యలో వచ్చాయి. ఒక్కసారిగా వడగళ్ల వానకు దాదాపు 200 మంది మరణించారు. ఆ అవశేషాలు 1,200 స౦వత్సరాల పాటు ఆ సరస్సులో ఉన్నాయి. అయితే, ఇవి కూడా కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే.

Roopkund_Lake0000

ఉత్తరాఖండ్ వెళ్లినప్పుడు ఖచ్చితంగా చూండండి

ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వెళ్లినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. అస్తిపంజరాల మాట పక్కన పెడితే.. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలి. ఆ దారిలో ఎన్నో జలపాతాలు, అందమైన పూల వనాలు మిమ్మల్ని మంత్ర ముగ్దులను చేస్తాయి. వర్షాకాలం, చలికాలం సీజన్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా రిస్క్.

ఒక్క నిముషంలొ నన్ను భయపెట్టగలరా? లేదా?

ఐతే మిమ్మల్ని ఒక్క నిముషంలో భయపెట్టనా? పైన ఫొటో చూడండి

ఈ చిన్న అమ్మాయి పేరు మరియా. సొంత తండ్రి చేతిలో దారుణంగా హత్యకు గురైన ప్పుడు ఆమెకు ఐదేళ్లు. ఆమెను చిత్రహింసలు పెట్టి, కళ్లు పొడిచి చివరికి చంపేశారు.

ఆమె మరణం తర్వాత, ఆమె తన తండ్రి పై పగ తీర్చుకోవాలని ఒక దెయ్యంగా తిరిగి వచ్చింది. ఈ షాకింగ్ సంఘటనను చూసిన ఓ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోని బంధించాడు.

ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలా ఉందో చూసేందుకు ఆయన స్టూడియోకు వెళ్లారు. ఆ ఫోటో చూడగానే వెన్నులో వణుకు వచ్చి ఏదో తప్పు జరిగిందనిపించింది. సరిగ్గా అప్పుడే తలుపు తట్టడం వినిపించింది. అది వినగానే భయంతో వణికిపోయాడు. ఒక నిమిషం పాటు కదలకుండా నిలబడి ఉన్నాడు. కాని ఎవరో తలుపు తట్టడం ఆగలేదు. ప్రతి సెకనుకీ అది బిగ్గరగా వినిపించింది.

చివరికి ధైర్యం చేసి తలుపు తెరవడానికి ముందుకు వెళ్ళాడు. ఆ దృశ్యాన్ని చూడగానే తెల్లబోయి చూశాడు. ఫోటోలో ఉన్న అమ్మాయి అతని ఇంటి దగ్గర నిలబడి ఉంది. మరుసటి రోజు ఫోటోగ్రాఫర్ తన ఇంట్లో శవమై కనిపించాడు.

ఈ చిత్రాన్ని చూసిన ఆ అమ్మాయి ప్రజల తలుపు తట్టి, తాను హత్య చేసిన విధంగానే వారిని చంపుతుంది.

నేను ఈ అన్ని విషయాలు నమ్మలేదు. ఈ యుగంలో దెయ్యాలు, భూతాలు అంటే ఎవరు నమ్ముతారు. మీరు కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని చూశారు. ఇప్పుడు మీకు ఏదైనా జరిగిందా? లేదుకదా?

సరే వేచి ఉండండి, ఎవరో నా తలుపు తట్టారు. నేను త్వరలో తిరిగి వస్తాను. అప్పటి వరకు జాగ్రత్త! మీరు కాదు?